హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా శిఖాగోయెల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయదశమి పండుగను పురస్కరించుకొని ఆమె విజిలెన్స్ డీజీగా, ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ జీఏడీగా పలు ఫైళ్లను సమీక్షించారు. ఈ రెండు శాఖలతోపాటు ఆమె రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బాధ్యతలను కూడా అదనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శిఖాగోయెల్ మాట్లాడుతూ.. ప్రజలకు అంకితభావంతో సేవ చేస్తూనే పరిపాలనలో పారదర్శకత, సమగ్రత, జవాబుదారీతనం ఉండేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రవాణాశాఖ నూతన కమిషనర్‌గా సీనియన్ ఐఏఎస్ అధికారి ఎం రఘునందన్‌రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో తన చాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం ఆయన చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కొత్త కమిషనర్‌కు రవాణాశాఖ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఇంధన పొదుపు రంగంలో 30 ఏండ్లపాటు సేవలందించిన ఏ చంద్రశేఖర్‌రెడ్డికి అరుదై న గౌరవం దక్కింది. కేంద్ర ప్రభు త్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) కు జాతీయ సలహాదారుగా నియమితులయ్యారు. శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రభుత్వ, మీడియా వ్యవహారాలకు సలహాదారుగా వ్యవహరిస్తారు.