జహీరాబాద్ : జహీరాబాద్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్య అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ జనార్ధన్(42) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. జహీరాబాద్ పట్టణంలోని మహేంద్ర కాలనీలో తన బంధువుల ఇంటి వద్దకు జనార్ధన్ గురువారం రాత్రి వచ్చాడు.
అయితే శుక్రవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో డాక్టర్ను బంధువులు చికిత్స కోసం జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. డాక్టర్ జనార్ధన్ మృతదేహానికి తోటి వైద్యులు నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.