కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సం ఓ వైద్యుడు ప్రాణాన్ని బలి తీసుకున్నది. రాజంపేట మండల కేంద్రంలో పల్లె దవఖానలో వైద్యుడుగా పనిచేస్తున్న డాక్టర్ వినయ్ తన ఇంటి వద్ద గోడకూలి అక్కడికక్కడ మృతి చెందాడు. అత్యంత భారీ వానాలతో రాజంపేట శివారులో రెండు చెరువు కట్టలు తెగి గ్రామంలోకి వరద బీభత్సం సృష్టించింది. ఇంటి ముందు వరదను నియంత్రించే క్రమంలో గోడ కుప్పకూలడంతో తీవ్ర గాయాలతో వైద్యుడు వినయ్ మృతి చెందాడు.
కాగా, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. నిజామా బాద్- హైదరాబాద్ మార్గంలో కామరెడ్డి జిల్లా బిక్కనూరు వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్న కారణంతో పలు రైళ్ల రాకపోకలను సౌత్ సెంట్రల్ రైల్వే నిలిపివేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రాయలసీమ ఎక్స్ప్రెస్ను రద్దు చేయగా, నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రైళ్లను కాచిగూడ, కాజీపేట, పెద్దపల్లి, నిజామాబాద్ మీదుగా దారి మళ్లిస్తున్నారు.