హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా విద్యార్థులను స్కూల్ బయటికి తీసుకెళ్లరాదని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ముఖ్యంగా జిల్లా విద్యాశా ఖా ధికారి (డీఈవో) అనుమతి లే కుండా ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను బయటికి తీసుకెళ్లరాదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.