నాంపల్లి కోర్టులు, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసుకున్న పిటిషన్లపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) బుధవారం కోర్టులో కౌంటర్ వేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగున్నందున వారికి బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశమున్నదన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుతోపాటు ఓ మీడియా సంస్థకు చెందిన వ్యక్తి అరెస్టు కోసం ఇటీవల వారెంట్ జారీ అయిందని, త్వరలో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని వివరించారు. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.