హైదరాబాద్ : మల్కాజ్గిరి ( Malkajgiri ) లో రౌడీయిజానికి ( Rowdies ) పాల్పడుతున్న నాయకుడికి బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )సూచించారు. శుక్రవారం మల్కాజ్గిరి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్కాజ్గిరిలో ఒకడు నేను గూండాను, రౌడీని అంటున్నాడు. నిన్ను కొట్టే రౌడీలు, గూండాలు మా దగ్గర కూడా చాలా మంది ఉన్నారని స్పష్టం చేశారు.
ఏ రౌడీ వచ్చినా భయపడ వద్దని అవసరమైతే తానే అక్కడికి వస్తానని భరోసా ఇచ్చారు. పొరపాటున నాయకులు, కార్యకర్తలపై ఏ చిన్న కేసు పెట్టినా విడిపించుకుంటామని కార్యకర్తల్లో జోష్ నింపారు. అడ్డగోలు మాటలు చెప్పి నోటికొచ్చిన హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, 100 రోజుల్లోనే 420 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి 900 రోజులు అయింది. హామీల అమలు ఇంకెప్పుడు చేస్తారని నిలదీశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.