Abhinav Bindra | విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సిందే.. ‘కాక్రోచ్’లకు నేను మద్దతిస్తున్నా..!
Abhinav Bindra : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా ఒలింపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా(Abhinav Bindra) సైతం విద్యార్థుల వెంట నిలిచారు.
Abhinav Bindra : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా ఒలింపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా(Abhinav Bindra) సైతం విద్యార్థుల వెంట నిలిచారు. దేశంలో కొన్ని అంశాలకు మనం పట్టింపులు లేకుండా ఎలా మద్దతిస్తామో.. విద్యార్థుల సమస్యలకు జరుగుతున్న ఈ ఉద్యమానికి కూడా అండగా నిలవాలని పిలుపినిచ్చారు.
నీట్ పేవర్ లీకేజీపై జవాబుదారీతనం కోరుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి ప్రజాదరణ పెరుగుతోంది. సామాజిక ఉద్యమకారులు, సినీ సెలబ్రిట్రీలే కాదు క్రీడా ప్రముఖులు కూడా ‘మేమూ మీ వెంటే’ అంటున్నారు. బీజింగ్ ఒలింపిక్స్లో పసిడి పతకంతో దేశం గర్వపడేలా చేసిన అభినవ్ బింద్రా కూడా విద్యార్థి ఉద్యమానికి మద్దతు పలికారు. జవంతర్ మంతర్ వద్ద రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న నిరసనల హోరుకు గురువారం ఎక్స్ పోస్ట్ ద్వారా ఈ మాజీ షూటర్ తన సంఘీభావం తెలియజేశారు.
I have never considered myself a political person. But I do believe that some issues belong to all of us, regardless of where we stand. Education is one of them.
The measure of a nation is found not only in its economy or its achievements, but in the opportunities it creates for…
— Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) July 23, 2026
‘నన్ను నేను రాజకీయవేత్తగా భావించను. కానీ, మనం ఏంటీ అనేదాని కంటే.. కొన్ని విషయాలు మనందరికి సంబంధించినవి. వాటిలో విద్యావ్యవస్థ ఒకటి. ఆర్ధిక పురోగతి, సాధించిన విజయాలనే బట్టే కాకుండా యువతకు కల్పిస్తున్న అవకాశాలను బట్టి ఒక దేశ అభివృద్ధిని కొలుస్తారు.
విద్యా వ్యవస్థ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు అందేలా చేస్తుంది. మనలో సృజనాత్మకతను పెంచే ఈ వ్యవస్థ దేశానికి అతిపెద్ద బలం. మన విద్యావ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు అందరం కలిసి.. పనిచేయాలి. అలా చేసినప్పుడే రేపటి తరాలకు అవకాశాలను, ఆవిష్తకరణలు చేసేందుకు ప్రోత్సాహాన్ని, నమ్మకాన్ని ఇవ్వగలుగుతాం’ అని ఎక్స్ పోస్టులో బింద్రా రాసుకొచ్చారు.
“Some Issues Belong To All Of Us”: Abhinav Bindra Hits Bullseye Amid NEET Paper Leak Protestshttps://t.co/khSCbpCNkk pic.twitter.com/S5bI6VP7sr
— NDTV Sports (@Sports_NDTV) July 23, 2026
షూటింగ్లో భారత్కు తొలి ఒలింపిక్ స్వర్ణం అందించిన బింద్రా.. వ్యాపారవేత్తగా, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్గా రాణిస్తున్నారు. తన పేరిట నెలకొల్పిన ‘అభినవ్ ఫ్యూచరిస్టిక్స్’ (Abhinav Futuristics) సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్నారీ మాజీ ఒలింపియన్. అంతేకాదు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీలో ఆయన సభ్యుడు కూడా.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

