‘ఫ్లోరోసిస్ నివారణలో మిషన్ భగీరథ నీరు కీలకపాత్ర’
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరు అందడంతో నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం రామదాస్ తండాలో ఫ్లోరోసిస్ సమస్య గణనీయంగా తగ్గిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య అన్నారు. గత పదేళ్లుగా గ్రామంలో...
– 10 ఏళ్లుగా ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదు
– జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య
నాంపల్లి, నవంబర్ 04 : మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరు అందడంతో నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం రామదాస్ తండాలో ఫ్లోరోసిస్ సమస్య గణనీయంగా తగ్గిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య అన్నారు. గత పదేళ్లుగా గ్రామంలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు వెల్లడించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని, మిషన్ భగీరథ మంచి కార్యక్రమమని ప్రశంసించారు. బుధవారం ఆయన రామదాస్ తండాను సందర్శించి మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై గ్రామస్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని మెగావత్ అంతిరాం ఇంటికి వెళ్లి నల్లా నీటి సరఫరా, నీటి నిల్వ, సరఫరాలో అంతరాయం ఏర్పడితే తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యల గురించి వివరాలు తెలుసుకున్నారు.
రోజుకు రెండుసార్లు నీరు సరఫరా అవుతోందని, అవసరాల కోసం నీటిని నిల్వ చేసుకుంటున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. నల్లాలకు లీకేజీలు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.మిషన్ భగీరథ పథకం అమలుకు ముందు బోరు నీటిపైనే ఆధారపడేవారమని, ఫ్లోరైడ్ నీటి వినియోగం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నామని గ్రామస్థులు వివరించారు. ప్రస్తుతం రక్షిత తాగునీరు అందుబాటులోకి రావడంతో ఫ్లోరోసిస్ సమస్య తగ్గిందని గ్రామ సర్పంచ్ మెగావత్ చిట్టి శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని ఇతర ప్రజలతోనూ మాట్లాడిన స్పెషల్ మానిటర్ ప్రస్తుతం తాగునీటి సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతోందని, ట్యాంకుల్లో నిల్వ చేసుకుని అవసరాలకు వినియోగించుకుంటున్నామని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ప్రస్తుతం ఫ్లోరోసిస్ కేసులు లేవని ఆశా కార్యకర్త వెల్లడించగా, గత పదేళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని మండల అధికారులు వివరించారు.
సీజనల్ వ్యాధులు మినహా ఇతర ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. గ్రామంలోని మొత్తం 250 ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించినట్లు గ్రామ కార్యదర్శి వివరించారు.అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో వినియోగిస్తున్న తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందేలా మిషన్ భగీరథ అధికారులు చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ నాగేశ్వరరావు, చండూరు ఆర్డీవో శ్రీదేవి, గ్రిడ్ ఈఈ లక్ష్మీనారాయణ, డీఈ అజయ్ కుమార్, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రామకృష్ణ శర్మ, సర్పంచ్ మెగావత్ చిట్టి శ్రీనివాస్, ప్రయోగశాల ఇన్ఛార్జి పి. వీరారెడ్డి, ఇతర అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఫ్లోరోసిస్ నివారణలో మిషన్ భగీరథ నీరు కీలకపాత్ర’
Attacking BSF Jawans | బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి.. ముగ్గురు మహిళలతో సహా 10 మంది అరెస్ట్
AP News | ఈ నెల 23న ఏపీలో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణస్వీకారం
కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

