Attacking BSF Jawans | బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి.. ముగ్గురు మహిళలతో సహా 10 మంది అరెస్ట్
Attacking BSF Jawans | సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లపై కొంతమంది గ్రామస్తులు దాడి చేశారు. కర్రలతో జవాన్లను కొట్టడంతో పాటు వారి నుంచి ఆయుధాలు లాక్కొనేందుకు ప్రయత్నించారు. ఈ దాడికి సంబంధించి ముగ్గురు మహిళలతో సహా పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అగర్తలా: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లపై కొంతమంది గ్రామస్తులు దాడి చేశారు. కర్రలతో జవాన్లను కొట్టడంతో పాటు వారి నుంచి ఆయుధాలు లాక్కొనేందుకు ప్రయత్నించారు. ఈ దాడికి సంబంధించి ముగ్గురు మహిళలతో సహా పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Attacking BSF Jawans) త్రిపురలోని సెపహ్లిజాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న త్రిపురలోని అశాబారి గ్రామంలో స్మగ్లింగ్ ఆరోపణలపై స్థానిక వ్యక్తిపై బీఎస్ఎఫ్ సిబ్బంది దాడి చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. నిరసనగా రోడ్డును దిగ్బంధించారు.
కాగా, ముగ్గురు బీఎస్ఎఫ్ సిబ్బంది ఉన్న వాహనం అక్కడకు చేరుకున్నది. దీంతో ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. కొందరు వ్యక్తులు కర్రలతో ఆ వాహనంలోని బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి చేశారు. వారి ఆయుధాలను లాక్కొనేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనలో కమాండర్‌తో సహా ముగ్గురు బీఎస్ఎఫ్ సిబ్బంది గాయపడ్డారు.
మరోవైపు త్రిపుర సీఎం మాణిక్ సాహా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. భద్రతా సిబ్బందిపై హింస ఆమోదయోగ్యం కాదని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు మహిళలతో సహా పది మందిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచారు.
అయితే ఏడుగురు పురుష నిందితులకు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించగా, ముగ్గురు మహిళలను 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి బీఎస్ఎఫ్తోపాటు గ్రామస్తుల ఫిర్యాదులను కలంచౌరా పోలీస్ స్టేషన్లో నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బీఎస్ఎఫ్ జవాన్లపై గ్రామస్తుల దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Watching this video is absolutely infuriating. These people are attacking our BSF personnel with sticks and rods, even when the jawans are armed.
Imagine this happening in the US. The consequences would have been immediate, and nobody would be questioning the authorities for protecting their own forces.
Why should our BSF personnel have to tolerate such blatant attacks? Anyone who dares to assault our armed forces in a mob should face the strictest legal consequences.
https://t.co/JuG32SlVuU
— Pinki (@PinkiPragya) November 3, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Attacking BSF Jawans | బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి.. ముగ్గురు మహిళలతో సహా 10 మంది అరెస్ట్
AP News | ఈ నెల 23న ఏపీలో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణస్వీకారం
కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
కృష్ణసాగర్‌లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

