‘వరి కొయ్యలను తగలబెట్టవద్దు’
వరి కొయ్యలు, ఇతర పంట అవశేషాలను తగలబెట్టవద్దని నల్లగొండ మండల తాసీల్దార్ పరశురాం, మండల వ్యవసాయ అధికారి సుంకోజు శ్రీనివాస్ రైతులకు సూచించారు. మండలంలోని చందనపల్లి గ్రామ శివారులో వరి కొయ్యలను కాల్చుతున్నట్లు సమాచారం అందడంతో...
– నల్లగొండ తాసీల్దార్ పరశురాం
– నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
నల్లగొండ రూరల్, నవంబర్ 04 : వరి కొయ్యలు, ఇతర పంట అవశేషాలను తగలబెట్టవద్దని నల్లగొండ మండల తాసీల్దార్ పరశురాం, మండల వ్యవసాయ అధికారి సుంకోజు శ్రీనివాస్ రైతులకు సూచించారు. మండలంలోని చందనపల్లి గ్రామ శివారులో వరి కొయ్యలను కాల్చుతున్నట్లు సమాచారం అందడంతో బుధవారం వారు పొలాన్ని సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వరి కొయ్యలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడడంతో పాటు, వెలువడే పొగతో రైతులు, పరిసర ప్రాంతాల ప్రజలు శ్వాసకోశ సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
మంటల వేడికి నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించడంతోపాటు, సేంద్రియ పదార్థం తగ్గి భూసారం దెబ్బతింటుందని వివరించారు. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నడం లేదా కంపోస్టు ఎరువుగా తయారు చేసుకోవడం వంటి పద్ధతులను పాటించాలని సూచించారు. దీనివల్ల భూమి సారవంతంగా ఉండటంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. రైతులు పర్యావరణ హిత పద్ధతులను అనుసరించాలని, నిబంధనలను ఉల్లంఘించి పంట అవశేషాలను కాల్చిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

