Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
వాతావరణ మార్పులను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని ది లాన్సెట్ నివేదిక సూచించింది. ప్రభుత్వ విధానాల్లో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం పెరగాలంటే ఈ చర్య అవసరమని పేర్కొంది. 2016 నుంచి 2023 మధ్య అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది మరణించినట్లు నివేదిక వెల్లడించింది.
Weather Changes | వాతావరణ మార్పులను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని ది లాన్సెట్ నివేదిక సూచించింది. ప్రభుత్వ విధానాల్లో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం పెరగాలంటే ఈ చర్య అవసరమని పేర్కొంది. 2016 నుంచి 2023 మధ్య అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది మరణించినట్లు నివేదిక వెల్లడించింది. నవంబరులో జరగనున్న కాప్-31 వాతావరణ సదస్సుకు ముందు బ్రిటన్‌కు చెందిన వైద్య పత్రిక ఈ నివేదికను ప్రచురించింది. 30 దేశాలకు చెందిన 146 మంది పరిశోధకులు ప్రపంచ ప్రజల ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని విశ్లేషించారు. 2023లో వేడి కారణంగా రికార్డు స్థాయిలో 7.10 లక్షల మంది మరణించగా, వారిలో 70 శాతానికి పైగా మరణాలకు మానవ కార్యకలాపాల వల్ల కలిగిన వాతావరణ మార్పులే కారణమని అంచనా వేశారు. 2015 పారిస్ ఒప్పందం తర్వాత ఎనిమిదేళ్లలో నమోదైన మూడు మిలియన్ల వేడి సంబంధిత మరణాల్లో 68 శాతం వాతావరణ మార్పుల వల్లే సంభవించాయని లాన్సెట్ కౌంట్‌డౌన్ పరిశోధన విభాగం వెల్లడించింది.
దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం..
వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రతి సంక్షోభం వచ్చినప్పుడు స్పందించడం కాకుండా, దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పరిశోధకులు సూచించారు. అధిక ఉష్ణోగ్రతల తీవ్రత, తరచుదనం పెరగడానికి వాతావరణ మార్పులు కారణమవుతున్నాయని సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు వివరించారు. మానవ కార్యకలాపాల వల్ల కలిగిన వేడికి కారణమైన మరణాలను అంచనా వేయడానికి వివిధ దేశాల్లో నమోదైన వేడి సంబంధిత మరణాలను పరిశీలించి, వాతావరణ మార్పులు లేకపోతే సంభవించేవాటిని మినహాయించారు. గతేడాది ప్రపంచ భూభాగంలో సగానికి పైగా ప్రాంతం కనీసం ఒక నెలపాటు తీవ్రమైన కరువును ఎదుర్కొన్నట్లు నివేదిక పేర్కొంది.
ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం..
వాతావరణ మార్పుల ప్రభావం ఆర్థిక వ్యవస్థపైనా తీవ్రంగా పడుతోంది. అధిక వేడి కారణంగా కార్మికుల పని సామర్థ్యం తగ్గడంతో గత మూడేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు పరిశోధకులు తెలిపారు. ఆగ్నేయాసియా దేశాలు తమ స్థూల దేశీయోత్పత్తిలో 3.9 శాతం, ఆఫ్రికా 3.2 శాతం మేర నష్టపోయాయి. ఐరోపాలో ఈ నష్టం 0.2 శాతం కాగా, అమెరికా ఖండాల్లో 1.5 శాతంగా ఉంది. మరోవైపు, 2016 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థలోని 194 సభ్యదేశాల్లో 56 దేశాలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ముందుగానే గుర్తించే ఆరోగ్య, హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరిచాయి. 2025లో స్వచ్ఛమైన ఇంధనంపై పెట్టుబడులు 2.1 ట్రిలియన్ డాలర్లకు చేరాయి. ఇది శిలాజ ఇంధనాలపై పెట్టిన పెట్టుబడులకు రెండింతలు.
శిలాజ ఇంధనాల వాడకం తగ్గాలి..
అయినప్పటికీ ప్రపంచ ఇంధన అవసరాల్లో 80 శాతం ఇప్పటికీ శిలాజ ఇంధనాల నుంచే తీరుతున్నాయి. వీటి వల్ల ఏర్పడే వాయు కాలుష్యంతో ఏటా 27.3 లక్షల మంది మరణిస్తున్నట్లు నివేదిక తెలిపింది. 2016 నుంచి కనీసం 77 దేశాల్లో శిలాజ ఇంధన కాలుష్యం తగ్గడం వల్ల సుమారు 3.23 లక్షల మరణాలను నివారించగలిగారు. వాతావరణ మార్పులు, ఆరోగ్యంపై పరిశోధనలకు నిధులు 2024లో 31.6 కోట్ల డాలర్లకు చేరాయి. అయితే, ఈ నిధుల్లో 84 శాతం సంపన్న దేశాల పరిశోధకులకే అందుతున్నాయి. వాతావరణ సంబంధిత ఆరోగ్య ముప్పు ఎక్కువగా ఎదుర్కొంటున్నది పేద దేశాలే కావడం గమనార్హం. మరోవైపు, అమెరికా సహా కొన్ని దేశాల నుంచి అవసరమైన సమాచారం అందుబాటులో లేకపోవడం పరిశోధనలకు ఆటంకంగా మారిందని పరిశోధకులు తెలిపారు. అంతర్జాతీయ రాజకీయ అస్థిరత కారణంగా గత రెండేళ్లుగా వాతావరణ మార్పులు, వాటి ఆరోగ్య ప్రభావాలపై దృష్టి తగ్గిందని, నిర్లక్ష్యం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోందని హెచ్చరించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
‘వరి కొయ్యలను తగలబెట్టవద్దు’
‘ఫ్లోరోసిస్ నివారణలో మిషన్ భగీరథ నీరు కీలకపాత్ర’
Attacking BSF Jawans | బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి.. ముగ్గురు మహిళలతో సహా 10 మంది అరెస్ట్
AP News | ఈ నెల 23న ఏపీలో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణస్వీకారం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

