Parasuram | సోలో, గీత గోవిందం, సర్కారు వారి పాట ఫ్యామిలీ ఆడియెన్స్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ పరశురాం. ఈ క్రేజీ డైరెక్టర్ 2024లో వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు పరశురాం కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ సారి నందమూరి హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది.
ఇంతకీ ఎవరా హీరో అనే కదా మీ డౌటు.. పటాస్ హీరో నందమూరి కల్యాణ్ రామ్. తాజా టాక్ ప్రకారం పరశురాం ఇప్పటికే కల్యాణ్ రామ్‌కు ఓ ఐడియాను చెప్పాడట. కల్యాణ్ రామ్‌కు పరశురాం చెప్పిన బేసిక్ ఐడియా నచ్చిందట. ఈ క్రమంలో పరశురాం పూర్తి స్థాయిలో స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం కల్యాణ్ రామ్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న మల్టీ స్టారర్‌తో బిజీగా ఉన్నాడు. వెంకటేశ్, కల్యాణ్ రామ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అన్నీ అనుకున్నట్టుగా కుదిరతే ఈ మూవీ పూర్తయిన తర్వాత కల్యాణ్ రామ్, పరశురాం సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్టు సమాచారం.
క్లాస్, మాస్ టచ్‌తో మంచి సందేశాన్ని జోడిస్తూ.. ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు పరశురాం. మరి ఈ సారి కల్యాణ్ రామ్‌తో ఎలాంటి సబ్జెక్టును రెడీ చేశాడనేది ఆసక్తి నెలకొంది. దీనిపై రాబోయే రోజుల్లో కొత్త అప్డేట్ వస్తుందేమో చూడాలి.
CJI | ‘లేకపోతే నేనే జోక్యం చేసుకుంట’.. ఢిల్లీలో మెట్రోస్టేషన్ల మూసివేతపై సీజేఐ
Spurious Fertilizer | నకిలీ ఎరువును విక్రయించిన వ్యాపారిపై చర్య తీసుకోవాలంటూ రైతు ఆందోళన
MK Stalin | నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే.. విద్యార్థుల ఆందోళనకు ఎంకే స్టాలిన్ మద్దతు