Stock Market | స్టాక్ మార్కెట్ పతనం.. 363 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
Stock Market : భారత స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో ముగిసింది. స్టాక్ మార్కెట్‌కు నష్టాలు రావడం వరుసగా ఇది నాలుగవ రోజు. బీఎస్ఈ సెన్సెక్స్ 363 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో ముగిసింది. స్టాక్ మార్కెట్‌కు నష్టాలు రావడం వరుసగా ఇది నాలుగవ రోజు. బీఎస్ఈ సెన్సెక్స్ 363 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయింది. ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ 76,515.10 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. తర్వాత 76,726.66 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. తర్వాత 76,151.98 పాయింట్ల కనిష్టాన్ని చేరింది.
చివరకు 363.66 పాయింట్ల నష్టంతో 76,391.39 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 126.65ద పాయింట్లు నష్టపోయి 23,869.60 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 195.78 పాయింట్లు నష్టపోగా, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 95.45 పాయింట్లు నష్టపోయింది. బీఎస్ఈలో టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎటర్నల్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, ఇండిగో, ఎస్బీఐఎన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్ షేర్లు 2.26 శాతం నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారక విలువ 14 పైసలు తగ్గి, 96.50 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 97.95 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్స్ ధర 4,088.87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇరాన్, అమెరికా యుద్ధం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వంటివి మార్కెట్ పతనానికి కారణాలు. మరోవైపు ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గురువారం నాటికి బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం విలువ రూ.477 లక్షల కోట్లుగా ఉంది. ఈ రోజు మార్కెట్ విలువ రూ.3 లక్షల కోట్లు క్షీణించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bse Sensex
- nifty
- stock market
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

