హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జరుగనున్న సార్వత్రిక సమ్మె నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను మరో రోజు నిర్వహించాలని తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశాయి.శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వివిధ సంఘాల నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినిని కలిసి విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, టీయూసీఐ, ఐఎఫ్డీయూ ప్రతినిధులు పాల్గొన్నారు.