హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ రోడ్ల పనుల్లో నాణ్యతపై రాజీ పడొద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ఎర్రమంజిల్ పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ఏఈఈలకు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి సీతక ప్రారంభించి ప్రసంగించారు. రూ. 1375 కోట్లతో గ్రామీణ రహదారులను నిర్మిస్తున్నామని, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో త్వర లో 500 కు పైగా కారుణ్య నియామకాలను చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.