Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావును అరెస్ట్ చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం పొడిగించింది. హరీశ్‌రావును ఈ నెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని హరీశ్‌రావు పిటిషన్ దాఖలు చేశారు.
జీ చక్రధర్‌గౌడ్ అనే వ్యక్తి హరీశ్‌రావుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ హరీశ్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు హరీశ్‌రావును అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే పిటిషన్‌పై బుధవారం విచారణ జరగ్గా.. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.