యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో బుధవారం అర్చకులు స్వామి వారికి నిత్యకైంకర్యాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులను పంచామృ తాలతో అభిషేకించారు. బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పట్టువస్ర్తాలు, స్వర్ణ ఆభరణాలతో అలంకరించి నిజాభిషేకం, తులసీఅర్చనలు చేపట్టారు.
లక్ష్మీనరసింహులను దివ్యమనోహరంగా అలంకరించి శ్రీసుదర్శన నారసింహహోమం, లక్ష్మీనరసింహుల నిత్యతిరుకల్యా ణం, అలంకార సేవోత్సవాలను నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా సాగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణమాసాన్ని పురస్క రించుకుని ఆలయంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు.