ఎక్స్పోర్ట్ హబ్‌లుగా జిల్లాలు

- పారిశ్రామికవేత్తల చేయూతకు కమిటీ
- ‘డిస్ట్రిక్ట్లెవల్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్' చైర్మన్‌గా కలెక్టర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లాల నుంచి ఎగుమతులను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ లెవల్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కమిటీ (డీఎల్ఈపీసీ)ని ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) రీజనల్ అథారిటీ ప్రతినిధి కో చైర్మన్‌గా, పరిశ్రమలశాఖ జిల్లా జనరల్ మేనేజర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా 10 మందిని నియమించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్, రాష్ట్ర పరిశ్రమలశాఖ కమిషనర్ నియమించే ప్రతినిధి, ఎమ్మెస్ఎంఈ మంత్రిత్వశాఖ ప్రతినిధి, సెక్టార్ స్పెసిఫిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రతినిధి, క్వాలిటీ స్టాండర్డ్ ఇంప్లిమెంట్ బాడీ ప్రతినిధి, జిల్లా ట్రేడ్, కామర్స్ అసోసియేషన్ తదితరులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తరుచూ సమావేశమై, జిల్లాలో ఎగుమతులకు అవకాశాలున్న ఉత్పత్తులను గుర్తించాలి. ఆ ఉత్పత్తులకు దేశవిదేశాల్లో ఉన్న డిమాండ్‌ను అధ్యయనం చేయాలి. ఆయా దేశాల్లో పాటించే నాణ్యతా ప్రమాణాలు, బ్రాండింగ్, ట్రేడ్‌మార్క్ తదితర వాటిపై పారిశ్రామికవేత్తలకు అవగాహన, చైతన్యం కల్పించాలి. ఎగుమతులకు అవసరమైన అనుమతులు కూడా సరళతరం చేసే లా చర్యలు తీసుకోనున్నారు. కమిటీలో రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రతినిధులుగా జేడీ, డీడీ స్థాయి అధికారులను నియమించారు.
తాజావార్తలు
- కుదిరిన ఒప్పందం
- ఆర్థికవృద్ధిలో కస్టమ్స్ది కీలకపాత్ర
- నేడు ఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్ షో
- మరింత విశాలంగా..బంజారాహిల్స్ రోడ్ నం. 12
- ఎక్స్ ఆఫీషియోల లెక్క తేల్చే పనిలో బల్దియా
- తొలిసారిగా నగరంలో 56 అంతస్తుల ఎత్తయిన భవనం
- దోమలపై దండయాత్ర
- పాదచారులకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
- గంగారం చెరువు తవ్వకాల్లో బయటపడిన పురాతన విగ్రహం
- ప్రజల రక్షణే ప్రాధాన్యం