వికారాబాద్(పూడూరు), ఏప్రిల్ 27: ‘బాత్రూమ్లోనే బతుకు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. ఈ కథనానికి స్పందించిన అధికారులు వికారాబాద్ జిల్లా చెంచుపల్లికి పరుగులు పెట్టారు. పూ డూరు మండలం ఎన్కెపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రా మమైన చెంచుపల్లికి 60 ఇండ్లు మంజూరయ్యాయి. దీంతో లబ్ధిదారులు తమ పాత ఇండ్లను నేలమట్టం చేయడంతో కాంట్రాక్టరు పనులు మొదలుపెట్టాడు.
ఇండ్లు పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేశాడు. దీంతో నిలువ నీడలేకపోవడంతో లబ్ధిదారులు బాత్రూమ్లోనే బతుకు సాగదీస్తున్నారు. ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. స్పం దించిన జిల్లా హౌసింగ్ బోర్డు అధికారులు సోమవారం చెంచుపల్లికి వెళ్లి ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితిపై ఆరాతీశారు. నిర్మాణం పూర్తికాని ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.