దేవరకద్ర రూరల్ (చిన్న చింతకుంట), అక్టోబర్ 8 : కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను మోసం చేసిందని, అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం వడ్డెమాన్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల మండ ల నాయకులతో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 420 హామీలు ఇచ్చి వాటి లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయకుండా ప్రతి ఇంటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిపడినందున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు.