హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): సివిల్స్‌లో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కు ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రజాభవన్‌లో నిర్వహించింది. సింగరేణి సంస్థ ద్వారా అమలు చేస్తున్న ఈ పథకం లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిరుడు 140మందికి ఆర్థిక సహాయం చేస్తే 10మంది సివిల్స్‌లో విజయం సాధించారని, ఈ ఏడాది 178 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు.