Bathukamma Saries | ములుగు, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలోని ఆరు జిల్లాల మహిళా సంఘాల సభ్యులకు బతుకమ్మ చీరలను కానుకగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల్లో నమోదైన 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకూ బతుకమ్మ చీరలు అందించగా.. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచుల చీరల పంపిణీ పేరుతో నూతన పథకాన్ని రూపొందించింది. రాష్ట్రంలో మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాతోపాటు గిరిజన జిల్లాలైన మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతోపాటు 18 ఏండ్లు నిండిన గిరిజన మహిళలకు చీరలను పంపిణీ చేసేందుకు ఆయా జిల్లాలకు సరఫరా చేశారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాకు 1,77,745 చీరలు చేరా యి. నేటి నుంచి తెలంగాణ ఆడపడుచుల చీరలను మహిళా సంఘాల ద్వారా ఎంపిక చేసిన సభ్యులకు అందించనున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం దుబాయ్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఐఎంఈఎక్స్ అమెరికా -2024 పేరిట లాస్ వెగాస్‌లో నిర్వహించనున్న అతి పెద్ద వాణిజ్య ప్రదర్శనలో ఆయన పా ల్గొంటారు. సోమవారం వాషింగ్ట న్ డీసీ చేరుకొని 8న లాస్ ఏం జెల్స్, 9,10 తేదీల్లో లాస్‌వెగాస్, 11న అ ట్లాంటాలో నిర్వహించే కార్యక్రమా ల్లో పాల్గొని 12న భా రత్ చేరుకొంటారు. ప్రపంచ సమావేశాలు, ఈ వెంట్లు, ప్రోత్సాహక ప్ర యాణాల కోసం నిర్వహించే వాణిజ్య ప్రదర్శనలో అమెరికా, భారత్, కెనడా, మెక్సికో, బ్రెజిల్, దుబాయ్ సహా పలు దేశాలు పాల్గొంటున్నాయి.