99.97% ఎలక్టోరల్ ఫామ్ల పంపిణీ పూర్తి
రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా ఎలక్టోరల్ ఫామ్ల పంపిణీ దాదాపు పూర్తయింది. ఆదివారం జూలై 12 రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లలో 3,38,15,364 మందికి (99.97%) ఎలక్టోరల్ ఫామ్లు పంపిణీ చేశారు.
- ఫామ్ల డిజిటలైజేషన్ 37.49 శాతం మాత్రమే..
- రాష్ట్రంలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియ
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా ఎలక్టోరల్ ఫామ్ల పంపిణీ దాదాపు పూర్తయింది. ఆదివారం జూలై 12 రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లలో 3,38,15,364 మందికి (99.97%) ఎలక్టోరల్ ఫామ్లు పంపిణీ చేశారు. ఫామ్ల డిజిటలైజేషన్ మాత్రం కొంత నెమ్మదిగా సాగుతున్నది. ఇప్పటివరకు 1,26,81,738 ఫామ్లను డిజిటలైజ్ చేశారు. ఇది మొత్తం ప్రక్రియలో 37.49 శాతం. జిల్లాలవారీగా డిజిటైజేషన్ పరిశీలిస్తే యాదాద్రి భువనగిరి జిల్లా 72.09 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత నల్లగొండ 63.20 శాతం, కుమ్రం భీం ఆసిఫాబాద్ 62.16, నిజామాబాద్ 58.80, సిద్దిపేట 58.65, రాజన్నసిరిసిల్ల 57.71, ఖమ్మం 56.52, ములుగు 53.66, కామారెడ్డి 53.48, నారాయణపేట 52.51, జోగుళాంబ గద్వాలలో 51.67 శాతం పూర్తి చేశారు.
హైదరాబాద్, మేడ్చల్లో ‘సర్’ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతున్నది. మేడ్చల్-మలాజిగిరి జిల్లాలో 9.82 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. హైదరాబాద్లో 13.79, రంగారెడ్డి 23.41, సంగారెడ్డి 34.26, భద్రాద్రి కొత్తగూడెం 37.48, వికారాబాద్లో 38.48 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. ఈ జిల్లాల్లో భారీగా పట్టణ జనాభా, అధిక ఓటర్ల సంఖ్య, ఫామ్ల పరిశీలన వంటి కారణాలతో ప్రక్రియకు మరింత సమయం పడుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఇక ఎలక్టోరల్ ఫామ్ల పంపిణీ జగిత్యాలలో 99.99 శాతం, సంగారెడ్డి 99.92, మెదక్ 99.91, రంగారెడ్డి 99.93, వికారాబాద్ 99.75, మహబూబ్నగర్ 99.95, యాదాద్రి భువనగిరి (99.89 శాతం పూర్తవగా.. మిగిలిన అన్ని జిల్లాల్లో దాదాపు 100 శాతం ఫామ్ల పంపిణీ పూర్తయినట్టు అధికారులు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

