హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : సీడ్ గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని మాజీ ఎంపీ సంతోష్కుమా ర్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి ఆలయంలో శనివారం 5,000 సీడ్ గణేశ్ విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులో ఔషధ మొక్కల విత్తనాలను విగ్రహాల తయారీలో వినియోగించేందుకు యోచిస్తున్నట్టు వెల్లడించారు.
పర్యావరణ హితమే లక్ష్యంగా 2018లో ‘గ్రీన్ ఇం డియా చాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించి లక్షలాది మొక్కలను నాటినట్టు వివరించారు. ఈ ఏడాది 5 లక్షల సీడ్ గణేశ విగ్రహాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఇదేరోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నటుడు నారా రోహిత్‌తో కలిసి ‘సుందరకాండ’ సినిమా ప్రమోషన్లో భాగంగా సీడ్ గణేశ్ విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు ఎస్ రాఘవేందర్ కోఆర్డినేట్ చేయగా, రాష్ట్ర జిల్లా కోఆర్డినేటర్లు స్థానికులు పాల్గొన్నారు.