హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): మహాపరినిర్వాణ్ దివస్ సందర్భంగా ప్రపంచమంతా అంబేద్కర్‌కు నివాళులర్పిస్తే ప్రపంచంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం నిరాదరణకు గురైందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి వై సతీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు పహారా ఏర్పాటు చేయడంపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
మషీరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఆశయ సాధనే తమ లక్ష్యమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. రిజర్వేషన్ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందించడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని అభిప్రాయం వ్యక్తంచేశారు. శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.