హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ హామీల్లో భాగంగా నెలకు రూ.2,500 ఇచ్చే మహాలక్ష్మి పథకాన్ని రాఖీ పండుగనాడు ప్రకటిస్తారని ఎదురుచూసిన మహిళాలోకానికి నిరాశే ఎదురైందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మహిళాలోకాన్ని సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా నిరాశపర్చారని ఒక ప్రకటనలో విమర్శించారు. ఉచిత బస్సు తప్ప ఏ హామీ ఇంతవరకు అమలు కాలేదని ఆరోపించారు. మహాలక్ష్మి పథకాన్ని వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించా రు. పథకం కోసం లక్షలాది మంది మహిళలు ఎదురుచూస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి త్వరగా అమలు చేయాలని కో రారు.
విద్యార్థులకు ఇస్తామన్న సూటీల పథకం అమలు కాలేదని, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని, అమలుపై అనేక ఆంక్షలు విధించారని తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు పింఛను కోసం ఎదురుచూస్తున్నారని, జనవరిలో దరఖాస్తులు తీసుకొని, ఇంతవరకు వా టి ఉసే ఎత్తడంలేదని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, మానభంగాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. శాంతిభద్రతలు అ దుపు తప్పాయని, హోంశాఖ సీఎం వద్దే ఉ న్నందున, సత్వరమే స్పందించాలని డిమాం డ్ చేశారు. మహిళా హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో అనేక మంది దవాఖానల పాలవుతున్నారని, కొం దరు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశా రు. మహిళల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.