హైదరాబాద్ : రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేసిన ప్రకటనపై దివ్యాంగులు(Disabled) హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.3,116కు వెయ్యి రూపాయలు కలిపి రూ.4,116 అందజేస్తామని నిన్న మంచిర్యాల జిల్లాలో జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఈ సందర్భంగా దివ్యాంగులు శనివారం రాష్ట్రమంతటా సీఎం కేసీఆర్, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల పాలిట దేవుడని వారు అభివర్ణించారు. హైదరాబాద్ నగరం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Mla Danam Nagendhar) ఆధ్వర్యంలో దివ్యాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం మరోసారి గొప్ప మనసును చాటుకున్నారని పేర్కొన్నారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందా కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. మెట్పల్లి మండలం జాగ్గాసాగర్ గ్రామంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి పెన్షన్‌ను పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో(Nallagonda Mla Camp Office) , వేములవాడ నియోజకవర్గం గొల్లపల్లి కొలనూరు గ్రామంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు.
సిరిసిల్లా జిల్లా మండేపల్లి గ్రామంలో కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న లింగం, పాక్స్ చైర్మన్ బండి దేవదాస్, గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి, బీఆర్ఎస్ నాయకులు బుస్స లింగం, అసాని ప్రతాప్ రెడ్డి,గుర్రం కిషన్ గౌడ్, రాగిపెల్లి కిష్టారెడ్డి, కడారి శ్రీను, లింగంపెల్లి రాజు, పెద్ది రాజు, దివ్యాంగులు పాల్గొన్నారు.