హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): పోలీసుల సమస్యల పరిషారానికి కృషి చేస్తానని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ హామీ ఇచ్చారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసుల సంక్షేమం, పదోన్నతులు, ఇతర పరిపాలనా అంశాల పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాలను సంఘం ప్రతినిధులకు వివరించారు.
ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది పనిచేసే యూనిట్ కేంద్రాల్లో వైద్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. మెడికల్ క్యాంపులను విస్తృతస్థాయిలో నిర్వహించి సిబ్బందికి వైద్య పరీక్షలు చేయాలని సూచించారు.