నల్లగొండ : కరువు పీడిత ప్రాంతమైన దేవరకొండ పరిధిలోని డిండి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తే గానీ నిండని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో డిండి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరింది. సోమవారం సాయంత్రానికే గట్టి అలలకు అలుగు మీద నుంచి నీరు కిందకు దూకుతున్నది. పైనుంచి వరద వస్తుండడంతో మంగళవారం ఉదయం నుంచి మత్తడి దుంకుతోంది. డిండి ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు, స్థానికులు తరలివస్తున్నారు.
భారీ వర్షాలకు డిండి ప్రాజెక్ట్ నిండి మత్తడి దుంకుతున్నది. pic.twitter.com/Muk1GjBSxM
— Namasthe Telangana (@ntdailyonline) September 7, 2021