Dilsukhnagar Blasts | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో కింది కోర్టు ఐదుగురికి విధించిన ఉరి శిక్షను రద్దు చే యాలన్న అప్పీళ్లపై హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పనున్నది. 2013 ఫిబ్రవరి 21న బస్టాప్‌లో, మిర్చిపాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లల్లో 18 మంది మరణించారు. 131 మంది గాయపడ్డారు. ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు చెప్పింది. ఐదుగురు ముద్దాయిలు ఈ తీర్పును రద్దు చేయాలని హైకోర్టులో అప్పీలు చేశారు. ఇటీవ ల విచారణ పూర్తి చేసిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ పీ శ్రీసుధతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పనున్న ది. ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ భతల్ పరారీలో ఉన్నాడు.