బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:13:07

రిషికేశ్‌లో చాతుర్మాస్య దీక్షలు

రిషికేశ్‌లో చాతుర్మాస్య దీక్షలు

  • విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో ప్రారంభించిన స్వరూపానందేంద్ర సరస్వతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో రిషికేశ్‌లోని ఆశ్రమంలో ఆదివారం చాతుర్మాస్య దీక్షలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ రెండో తేదీ వరకు కొనసాగే ఈ దీక్షలను పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో వ్యాసపూజతో ప్రారంభించారు. రిషికేశ్‌లోని శారదాపీఠం ఆశ్రమానికి సమీపంలోని గంగానదీమ తల్లికి, ఆ తర్వాత గోమాతకు పూజలు నిర్వహించారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని విశాఖ శారదాపీఠం ఆవరణలో ఆదివారం ఘనంగా గురుపూజ మహోత్సవం నిర్వహించారు. 


logo