Diesel Smuggling | కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు డీజిల్ స్మగ్లింగ్.. కోకాపేటలో 15 వేల లీటర్లు సీజ్
కర్ణాటకలో తక్కువ ధరకు డీజిల్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అధిక ధరకు అమ్ముతున్న ముఠాను (Diesel Smuggling) పోలీసులు అరెస్టుచేశారు. కోకాపేటలో అక్రమంగా డీజిల్‌ను అమ్ముతున్న ఆరుగురిని సైబరాబాద్ ఎస్వోటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: కర్ణాటకలో తక్కువ ధరకు డీజిల్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అధిక ధరకు అమ్ముతున్న ముఠాను (Diesel Smuggling) పోలీసులు అరెస్టుచేశారు. కోకాపేటలో అక్రమంగా డీజిల్‌ను అమ్ముతున్న ఆరుగురిని సైబరాబాద్ ఎస్వోటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోముగ్గురు పరారీలో ఉన్నారు. వారి నుంచి 15 వేల లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తొమ్మిది మంది సభ్యులతో కూడిన డీజిల్ స్మగ్లింగ్ ముఠా.. కర్ణాటకలో లీటరు డీజిల్‌ను రూ.85.75కు కొనుగోలుచేసి భారీ ట్యాంకర్లలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారని, నగర శివార్లలో దానిని చిన్న ట్యాంకర్లలో నింపుతున్నారని చెప్పారు. దానిని క్రషర్ యజమానులు, ఇసుక లారీలకు రూ.92 నుంచి రూ.94కు బిల్లులు లేకుండా విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నాలుగు డీజిల్ ట్యాంకర్లను సీజ్ చేశామని, పట్టుబడిన 15 వేల లీటర్ల డీజిల్ ధర మార్కెట్లో రూ.14.36 లక్షలు ఉంటుందన్నారు. మరో ముగ్గురు నిందితులు పరారయ్యాని, వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా, ఈవ్యవహారంపై సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

