మందమర్రి/కాసిపేట, ఏప్రిల్ 21 : ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన ప్రజా కళాకారుడు రాంటెంకి రాజాతిరుపతి(44) వడదెబ్బతో మంగళవారం మృతిచెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాంటెంకి రాజాతిరుపతి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడిగా పని స్తున్నాడు. సోమవారం ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం నెన్నెల మండలానికి వెళ్లాడు. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురికాగా మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రాజాతిరుపతి తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో అందరినీ చైతన్య పరిచాడు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. రాజా తిరుపతి అంతిమ యాత్రలో ప్రజా గాయకుడు గద్దర్ కూతురు, తెలంగాణ సాంస్కృతిక సార థి చైర్పర్సన్ వెన్నెల పాల్గొన్నారు. కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.