హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని, వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. గంజాయి, డ్రగ్స్ కింగ్పిన్లపై దృష్టిసారించామని, ఇప్పటివరకు ఒక్క ధూల్‌పేటలోనే 15మంది గంజా యి కింగ్‌పిన్‌లను, 42మంది విక్రయదారులను గుర్తించినట్టు చెప్పారు. శనివారం అబ్కారీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. గంజాయికి హాట్‌స్పాట్‌గా ఉన్న ధూల్‌పేటను ఆగస్టు 31 నాటికి గంజాయి రహిత ప్రాంతంగా మార్చుతామని స్పష్టంచేశారు.
‘ఆపరేషన్ ధూల్‌పేట’లో భాగంగా ఇప్పటికే ఆ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నామని, ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని వివరించారు. డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందు కు టీజీన్యాబ్, టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ, పోలీసుల సహకారంతో ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా దాడులు చేపడుతున్నట్టు తెలిపారు. శనివారం ధూల్‌పేటలో రాహుల్ సింగ్ అలియాస్ సమన్సింగ్ అనే వ్యక్తితోపాటు మరికొందరి నుంచి 54 కిలోల గంజాయి పట్టుకున్నామని, మరోచోట నాటుసారా తయారీకి వినియోగిం చే బెల్లం, పటికను స్టేట్ టాస్‌ఫోర్స్ టీమ్‌లు స్వా ధీనం చేసుకున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో గం జాయి, డ్రగ్స్ నిల్వ కేంద్రాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. వాటి సమాచారం ఎవరికైనా తెలిస్తే తమకు అందజేయాలని కోరారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఖురేషీ, సిబ్బంది పాల్గొన్నారు.