ఏటూరునాగారం, డిసెంబర్ 22 : మావోయిస్టులు, పౌరహక్కుల సంఘాలకు వ్యతిరేకంగా మావోయిస్టు బాధిత కుటుంబాలు ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయ సమీపంలోని జాతీయ రహదారిపై ధర్నా చేపట్టి పౌరహక్కుల సంఘం దిష్టిబొమ్మను దహనం చేశారు. గత నెల 21న రాత్రి వాజేడు మండల కేంద్రంలో ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేసిన పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేశ్, ఎడ్ల కాపరి ఉయిక అర్జున్ కుటుంబాలతో పాటు అంతకుముందు వెంకటాపురం మండలంలో బాంబు పేలి న ఘటనలో కాళ్లు కోల్పోయిన సునీత, ఇ తర బాధిత కుటుంబాల సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నెల ఒకటిన ఏటూరునాగారం మండలం చెల్పాక ఎన్కౌంటర్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందిన విషయం తెలిసిందే. పౌర హక్కు ల సంఘాల నాయకులు ఆదివారం ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలానికి వస్తున్న ట్టు తెలుసుకున్న రమేశ్, అర్జున్ కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ఏటూరునాగారం వచ్చారు. మావోయిస్టులచేత హత్య చేయబడిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకురాని పౌరహక్కుల సంఘం నాయకులు మావోయిస్టులు చనిపోతే రావడం ఏమిటని ప్రశ్నించారు.