హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో ధర్నాలు, రాస్తారోకోలు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు పండుగ కూడా చేసుకోలేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటొన్నారు. జీతాలు లేక, ఇచ్చిన సకాలంలో ఇవ్వకపోవడంతో పండుగ పూట కూడా పస్తులు ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మూడు నెలలుగా జీతాలు రావడం లేదని ఆరోపిస్తూ గ్రామపంచాయతీ కార్మికులు(Gram Panchayat workers) ఎంపీడీవో కార్యాలయం(MPDO office) ఎదుట ధర్నాకు(Dharna) దిగారు.
వివరాల్లోకి వెళ్తే..నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు మూడు నెలలుగా జీతాలు రావడం లేదని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. జీతాలు సకాలంలో రాక బ్రతకడమే కష్టంగా ఉందంటే పండగ ఎలా చేసుకోవాలంటూ కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.