హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): పాడి రైతులకు మంగళవారం రూ. 50 కోట్ల పాల బకాయిలను చెల్లిస్తామని విజయ డెయిరీ చేసిన ప్రకటన ఉత్తమాటగానే మిగిలిపోయింది. విజయ డెయిరీ ఎండీ ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం రాత్రి వరకు నయా పైసా కూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. పాడి రైతులకు సుమారు 150 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బకాయిలు చెల్లించాలని డిమాం డ్ చేస్తూ ఈ నెల 26న పాడి రైతులు ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం 50 కోట్లు చెల్లించేందుకు నిర్ణయించింది. ఎలాంటి ఆందోళనలో పాల్గొనవద్దని రైతులకు సూ చించింది. ధర్నాకు రైతులు రాకుండా చేయాలనే కు ట్రతో ఈ తప్పుడు ప్రకటన చేశారని పాడిరైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని, వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.