అంబేద్కర్ సాక్షిగా ఆందోళన భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం సిరిసిల్లలో ధర్నా చేస్తున్న జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ తదితరులు
కామారెడ్డి నిప్పుకణిక
ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ తదితరులు
సబితమ్మ ఆగ్రహం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిరసన తెలియజేస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
కడియం కన్నెర్ర
ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఈడీ.. మోదీ దాడి
జనగామ జిల్లా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ నాయకులు
దుబ్బాక దంగల్
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాస్తారోకోలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, నాయకులు
వైరా.. కేంద్రంపై సైరా..
ఖమ్మం జిల్లా వైరాలో మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు, కార్యకర్తలు
కోవ.. నిరసన తోవ
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి
జహీరాబాద్ జంగ్
జహీరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, నాయకులు తన్వీర్, శివకుమార్ తదితరులు
సిద్దిపేట.. ఉద్యమ బాట
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా సిద్దిపేటలోని మోడ్రన్ బస్టాండ్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
అందోల్.. ఆందోళన
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఫ్లెక్సీ చేతబట్టి నిరసన ర్యాలీ తీస్తున్న అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, బీఆర్ఎస్ నాయకులు