యాదాద్రి భువనగిరి : డబుల్ బెడ్ రూం (Double bedroom houses)ఇండ్లకు మౌలిక వసతులు త్వరగా కల్పించి లబ్ధిదారులకు వెంటనే ఇండ్లను అందజేయాలని డిమాండ్ చేస్తూ డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భువనగిరి కలెక్టరేట్(Bhuvanagiri Collectorate) ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసిన డబుల్ బెడ్ ఇండ్లను అర్హులకు కేటాయించాలన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పైసా ఖర్చులేకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా తాత్సారం చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం స్పందించిన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.