మధిర(చింతకాని), జనవరి 25: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని నల్లగొండ ఆదినారాయణ ప్లకార్డుతో ఖమ్మం-బోనకల్లు ప్రధాన రహదారిపై శనివారం ధర్నాకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ గ్రామసభ జాబితాలో తన పేరు లేదని ఆవేదన వ్యక్తంచేశాడు. అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వేలో అనేక అవకతవకలు జరిగాయని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు రాలేదని వాపోయాడు.
యూపీఎస్ వద్దు.. ఓపీఎస్సే ముద్దు ; ఎన్‌ఎంవోపీఎస్ సెక్రటరీ ; జనరల్ స్థితప్రజ్ఞ
హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్)ను ఒప్పుకోబోమని.. పా త ఓల్డ్ పెన్షన్ స్కీంను తిరిగి పునఃరుద్ధరించాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ గంగాపురం స్థితప్రజ్ఞ స్పష్టంచేశారు. ఏప్రిల్ 1 నుంచి కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీంను అమలుచేసేందుకు శనివారం కేంద్ర ఆర్థికశాఖ గెజిట్ విడుదల చేసిం ది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీఎస్‌తో నేషనల్ పెన్షన్ ట్రస్ట్‌లో జమ అయిన 10.5లక్షల కోట్లు కార్పొరేట్ల చేతుల్లోకి వెళతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్ పాల్గొన్నారు.