ధర్మపురి క్షేత్రంలో కల్యాణ వైభోగం
ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం లక్ష్మీనారసింహ(యోగ, ఉగ్ర) కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 6 గంటలకు శాస్ర్తోక్తంగా శేషప్ప కళావేదికపై స్వామివారి కల్యాణాన్ని కనులపండువగా జరిపారు.
ధర్మపురి, మార్చి 4: ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం లక్ష్మీనారసింహ(యోగ, ఉగ్ర) కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 6 గంటలకు శాస్ర్తోక్తంగా శేషప్ప కళావేదికపై స్వామివారి కల్యాణాన్ని కనులపండువగా జరిపారు. శ్రీలక్ష్మీనారసింహ(యోగ, ఉగ్ర), శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించి శేషప్ప కళావేదికపై అధిష్ఠించారు.
స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున కలెక్టర్ యాస్మిన్ బాషా పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సాయంత్రం ఎంపీ వెంకటేశ్ నేతకాని, ధర్మపురి కమిషనర్ రమేశ్, మంత్రి ఈశ్వర్ సతీమణి స్నేహలత, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, అడిషనల్ కలెక్టర్ మకరంద్ పట్టువస్ర్తాలు, తలంబ్రాలు అందజేశారు. మతానికి అతీతంగా కలెక్టర్ యాస్మిన్ బాషా స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. నుదుట గంధం, కుంకుమతోపాటు తలపాగా ధరించి పాల్గొన్నారు. దీంతో పలువురు కలెక్టర్పై ప్రశంసల జల్లు కురిపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

