Bhu Bharati | హైదరాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం ‘పాత సీసాలో కొత్త సారా..’ లాగానే ఉన్నది. రైతుల భూముల పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన ధరణిని తిట్టిపోసిన కాంగ్రెస్‌కు, ఇప్పుడు ఆ ధరణి మార్గదర్శకాలే దిక్కయ్యాయి. నాడు ధరణిలో పొందుపరిచిన అంశాలనే భూభారతిలో యథాతథంగా ఎత్తిపోసింది. 33 మాడ్యూల్స్‌ను ఆరుకు తగ్గించామంటూ గొప్పగా ప్రకటించింది. ఇందులోనూ మాయ చేసింది. ప్రస్తుతం ఉన్న 33 మాడ్యూల్స్‌లోని వివిధ అంశాలన్నింటిని కలిపేసి ఆరు మాడ్యూల్స్‌లో పొందుపరిచింది. అన్నీ కలిపేసి మాడ్యూల్స్ తగ్గించామంటూ ప్రకటించేసింది. ఇందులో ఒకటి రెండు మినహా కాంగ్రెస్ సర్కారు కొత్తగా చేసిందేమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భూభారతి అమలుకు సంబంధించి రెవెన్యూ శాఖకు చెం దిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘ధరణి పేరు మాత్రమే మారింది. అంతా సేమ్ టు సేమ్’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.
కొత్తదనం లేని భూభారతి
కాంగ్రెస్ సర్కారు ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన భూభారతిలో కొత్తదనం కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి రెండు మార్పులు తప్ప పూర్తిగా ధరణిని దించేశారనే అభిప్రాయాలు రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా కొన్ని అంశాలు ఇప్పట్లో అమలు చేసే అవకాశం లేకపోయినప్పటికీ ఇందులో పొందుపరిచి అమలు చేస్తున్నట్టుగా చెప్పుకోవడం గమనార్హం.
అందులోని కొన్ని అంశాలను పరిశీలిస్తే…
రైతులపై ఫీజుల మోత
భూభారతి చట్టం పేరుతో సర్కారు ఫీజుల మోత మోగించనున్నది. మ్యుటేషన్ కోసం ఎకరాకు రూ.2,500 వసూలు చేయనున్నది. కొత్త పాస్ పుస్తకం కోసం రూ.300 చెల్లించాల్సిందే. ఇక కాంగ్రెస్ సర్కారు కొత్తగా తెచ్చిన రికార్డు మార్పులు, ఇతర అప్పీళ్ల కోసం రూ.1,000 ఫీజు సమర్పించుకోవాల్సిందే. అమలుకు ఆలస్యమెందుకు?
భూభారతి అంతా సవ్యంగా ఉంటే.. పూర్తిస్థాయిలో అమలు చేయకుండా, ఎం దుకు ఆసల్యం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. తొలుత నాలుగు మండలాల్లో మాత్రమే అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని సర్కారు ప్రకటించింది. అయితే అప్పటినుంచైనా పూర్తిస్థాయిలో అమలు చేస్తారా, లేదా? అనే సందేహాలు రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రెండు నెలల పాటు అవగాహన సదస్సులు పెట్టాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. దీంతోపాటు గత డిసెంబర్లో సర్కారు అసెంబ్లీలో భూభారతి చట్టం చేసింది. తాజాగా పోర్టల్‌ను ప్రారంభించడంతోపాటు మార్గదర్శకాలు విడుదల చేసింది. అంటే చట్టం చేసిన తర్వాత నాలుగు నెలలు అమలులో ఎందుకు జాప్యం చేసిందనే ప్రశ్న వినిపిస్తున్నది. అదేవిధంగా గ్రామస్థాయిలో రెవె న్యూ సేవలు అందించేందుకు 10,954 మంది గ్రామ పాలన అధికారులను(జీపీవో) నియమిస్తామని సర్కారు ప్రకటించింది. కానీ, వీరి నియామకం పూర్తి కాకుండానే పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నది.
అమలుకు ఆలస్యమెందుకు?
అస్తవ్యస్తంగా ఉన్న ధరణిని బంగాళాఖాతంలో కలిపి రైతులకు మేలు చేసేందుకు భూ వివాదాలు లేని తెలంగాణ కోసం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్టు కాంగ్రెస్ సర్కారు గొప్పగా ప్రకటించింది. అయితే సర్కారు పెద్దలు చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూభారతి అంతా సవ్యంగా ఉంటే.. పూర్తిస్థాయిలో అమలు చేయకుండా, ఎందుకు ఆసల్యం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. తొలుత నాలుగు మండలాల్లో మాత్రమే అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిం దే. జూన్ 2వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తామని సర్కారు ప్రకటించింది. అయితే అప్పటినుంచైనా పూర్తిస్థాయిలో అమలు చేస్తారా, లేదా? అనే సందేహాలు రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.