యాదగిరిగుట్ట: రాష్ట్ర డీజీపీ బీ. శివధర్ రెడ్డి యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లిన డీజీపీ.. యాదాద్రీశుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదం అందజేశారు.
కాగా, ఆదివారం, దసరా సెలవులకు చివరి రోజు కావడంతో యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనారసింహుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలకు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతున్నది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.