DSPs Transfers | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 9మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీగా పనిచేస్తున్న కాజీపేట్ ఏసీపీగా, సిద్దిపేట సీసీఆర్బీలో ఏసీపీగా ఉన్న సీహెచ్ శంకర్‌రెడ్డిని మేడ్చల్ ఏసీపీగా, మేడ్చల్ ఏసీపీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కు బదిలీ చేశారు.
రాచకొండ ఎస్వోటీ ఏసీపీ వీ శ్రీకాంత్‌గౌడ్‌ను శంషాబాద్ ఏసీపీగా, ఖమ్మం సీసీఆర్బీలో ఏసీపీ పున్నం రవీందర్‌రెడ్డిని నర్సంపేట్ ఏసీపీగా, నర్సంపేట్ ఏసీపీగా చేస్తున్న వీ కిరణ్‌కుమార్‌ను డీజీపీ ఆఫీస్‌కు బదిలీ చేశారు. అలాగే హైదరాబాద్ సీపీఎస్‌లో ఏసీపీ వై హరికుమార్‌ను కాచిగూడ ఏసీపీగా, టీజీపీఏ డీఎస్పీ ఎస్ సారంగపాణిని వైరా ఏసీపీగా, వైరా ఏసీపీగా ఉన్న ఎం ఏ రెహ్మాన్‌ను డీజీపీ ఆఫీస్‌కు బదిలీ చేశారు.