హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై అప్పులపాలై పోలీసు సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని డీజీపీ సీవీ ఆ నంద్ అన్నారు. ‘ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం’ సందర్భంగా గు రువారం పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ‘ఆత్మహత్యలు వద్దు’ అంటూ ప్రకటన విడుదల చేశారు. నాలుగు నెలల్లో రాష్ట్ర ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం తనను కలచివేసిందన్నారు. ఈ ఘటనలపై జరిపిన విచారణలో ఆన్లైన్ బెట్టింగ్ మూలంగా అప్పులపాలవడమే ప్రధాన కారణంగా తేలిందని పేరొన్నారు. పో లీసు సిబ్బంది ఎదురొంటున్న సమస్యలపై శాఖ తరఫున దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు ఉన్నతాధికారులను సంప్రదించి పరిషారం పొందాలని చెప్పారు.