హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డెంగ్యూ పరీక్షల కోసం దవాఖానల్లో సరిపడా కిట్లు ఉన్నాయని డీజీఎంఎస్ఐడీసీ తెలిపింది. ‘జ్వరాలతో చస్తున్నా పట్టించుకోరా?’ శీర్షికన గురువారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన వార్తకు వైద్యశాఖ వివరణ ఇచ్చింది. ఇప్పటివరకు 12.82 లక్షల డెంగ్యూ టెస్టింగ్ కిట్లను దవాఖానలకు పంపిణీ చేశామని తెలిపింది. సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. సీఎంఎస్లలో నిల్వలు కూడా ఉన్నాయని పేర్కొంది. దీంతో పాటు డీఎంఈ, డీపీహెచ్, టీవీవీపీ పరిధిలోని దవాఖానలు తమకు కేటాయించిన బడ్జెట్ నుంచి కావాల్సిన మందులు కొనుగోలు చేస్తున్నాయని వివరించింది.
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): టీజీ జెన్కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్స్ పోస్టుల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జూలై 14న ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను https://tggenco. comలో అభ్యర్థులు చూసుకోవచ్చని టీజీ జెన్కో సీఎండీ శుక్రవారం తెలిపారు.