హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 89,52,024 మంది పిల్లలకు అల్బెండజోల్ ట్యాబ్లెట్లు అందజేసినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మొత్తం 96,05,790 మందికి ట్యాబ్లెట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మొదటిరోజే 93.19 శాతం మందికి వేసినట్టు పేర్కొన్నది. మిగతావారికి ఈ నెల 27న అందజేస్తామని తెలిపింది.