వేములవాడ, నవంబర్ 12: రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులను బెదిరించి బంగారం, నగదు కాజేసిన ఘటన బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకున్నది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు దేవుపల్లి భూదవ్వ -చంద్రయ్య వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చారు.
స్వామివారి దర్శనం బంద్ కావడంతో భీమేశ్వరాలయంలో దర్శనం చేసుకున్న అనంతరం నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శించుకునేందుకు తిప్పాపూర్‌లో ఆటోలో ఎకి నాంపల్లి వైపు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. ఆటోడ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి వీరిని కొంత దూరంలోని పంట చేనులోకి తీసుకువెళ్లారు. మెడలోని బంగారం, నగదు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. 2.5 తులాల బంగారు గొలుసుతోపాటు రూ.2 వేల నగదు లాక్కుని పరారైనట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.