Yadadri | యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ వెన్నెకృష్ణుడు అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం ఆలయ మాడవీధుల్లో స్వామివారు భక్తులకు వెన్నెకృష్ణుడిగా దర్శనమిచ్చారు. ఈ అలంకార సేవలో కార్యనిర్వహణాధికారి, అనువంశిక ధర్మకర్త, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.