తాడ్వాయి, జనవరి 23 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం వనదేవతల దర్శనానికి వచ్చిన ఎంఆర్ వినోద్ (58) అనే భక్తుడు గుండెపోటుతో మృతిచెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని ఈసీఎల్కు చెందిన వినోద్ కుటుంబసభ్యులతో కలిసి గురువారం సాయంత్రం మేడారానికి చేరుకున్నారు. రాత్రి భోజనాలు చేసిన అనంతరం జాతర పరిసరాల్లో గదిని అద్దెకు తీసుకొని విడిదిచేశారు. తెల్లవారుజామున కుటుం సభ్యులు లేపేందుకు ప్రయత్నించగా ఎంతకూలేవలేదు. దీంతో వెంటనే మేడారం కల్యాణ మండపంలోని ప్రధాన దవాఖానకు తరలించగా, పరీక్షించిన వైద్యలు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.